యూఎస్‌లో రికార్డు రిలీజ్‌కు సిద్ధమైన ‘ప్రేమమ్’!

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’కు రీమేక్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇక నాగ చైతన్య కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా ప్రేమమ్ నిలుస్తుందన్న ప్రచారం మొదట్నుంచీ వినిపిస్తూ ఉండడంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా విడుదల కానుంది.

యూఎస్‌లో ప్రేమమ్ సినిమా సుమారు 110కి పైగా స్క్రీన్స్‌లో విడుదల కానుండడం విశేషంగా చెప్పుకోవాలి. నాగ చైతన్యకు యూఎస్‌లో ఇదే అతిపెద్ద రిలీజ్‌. ‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‍లు హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్, నాగార్జున గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి.