సమీక్ష : ప్రేమెంత పనిచేసె నారాయణ – కొత్తదనం లేని ప్రేమ కథ

 Prementha Panichese Narayana movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : జొన్నలగడ్డ హరికృష్ణ , అక్షిత, ఝాన్సీ

దర్శకత్వం : జొన్నలగడ్డ శ్రీనివాస్

నిర్మాతలు : సావిత్రి జొన్నలగడ్డ

సంగీతం : వినోద్ యాజమాన్య

జొన్నలగడ్డ హరికృష్ణ , అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ప్రేమెంత పనిచేసె నారాయణ . ఈరోజు ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అనాదైన హరి (హరి కృష్ణ) హైదరాబాద్ లో స్క్రాప్ షాప్ లో పనిచేస్తుంటాడు. అదే ఎరియాలో వున్నా శిరీష (అక్షిత)ను చూసి ఇష్టపడుతాడు. అక్షిత కూడా హరి ని ప్రేమిస్తుంది. కానీ వీరి పెళ్లికి శిరీష తల్లి ఒప్పుకోదు దాంతో ఇద్దరు పారిపోదాం అనుకుంటారు. ఈ క్రమంలో శిరీష కత్తిపోటు కు గురైతుంది. ఈనేరం కాస్త హరి మీద పడుతుంది. ఇంతకీ శిరీష ను చంపాలనుకున్నది ఎవరు? చివరికి హరి, శిరీష కలిసారా లేదా అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్లస్ అంటే హరి పాత్రే. ఈపాత్రలో నటించిన హరి కృష్ణ తన మొదటి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ,ఇక హీరోయిన్ పాత్రలో నటించిన అక్షిత గ్లామర్ పరంగా యావరేజ్ అయినా నటన తో మెప్పించింది. ఈ రెండు పాత్రల తరువాత సినిమాలో గుర్తిండిపోయే పాత్రా నటి ఝాన్సీ ది.

మేయర్ పాత్రలో నటించిన ఝాన్సీ తన నటనతో సినిమాను కాపాడే ప్రయత్నం చేసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అలాగే తక్కువ రన్ టైం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మైనస్ అంటే రొటీన్ స్టోరీ. కథ రొటీన్ గా వున్నా కథనం అయినా ఆసక్తిగా లేకపోవంతో సినిమా బోరింగ్ అనిపిస్తుంది. బివీటికి తోడు ఒక్క ఝాన్సీ తప్ప తెలిసిన నటీనటులు ఎవరు లేకపోవడం అంతా కొత్త వారు కావడంతో వారి యాక్టింగ్ కనెక్ట్ అవ్వడం కష్టం గా అనిపిస్తుంది.

ఇక సినిమాలో విలన్ రోల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఆ పాత్రలో నటించిన నటుడు యాక్టింగ్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాకు ఇంపాక్ట్ తీసుకొచ్చే పాత్రా ఒక్కటి కూడా లేదు ఈ చిత్రంలో. ఎంగేజింగ్ గా లేని సన్నివేశాల తో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఒక రొటీన్ కథను ఆసక్తికరంగా తెర మీదకు తీసుకు రావడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. గ్రిప్పింగ్ గా లేని స్క్రీన్ ప్లే , ఎంగేజ్ చేయలేకపోయిన సన్నివేశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. ఇక మిగితా టెక్నిషియన్స్ విషయానికి వస్తే వినోద్ యాజమాన్య సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగుంది. ఎడిటింగ్ కూడా ఒకే. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపిస్తుంది. లో బడ్జెట్ తో తీసిన క్వాలిటీ పరంగా ఓకే అనిపించుకోవడంలో నిర్మాతలు విజయం సాధించారు.

తీర్పు :

లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల నటన , ఝాన్సీ రోల్ హైలైట్ అవ్వగా రొటీన్ స్టోరీ , స్రీన్ ప్లే మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. సో ఈసినిమా కి దూరంగా ఉండడమే మంచింది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Exit mobile version