ప్రెస్ నోట్స్ : “ఇష్మార్ట్ జోడి” సీజన్ 2 స్టార్ మా లో…!

Published on Dec 26, 2021 7:00 am IST

ప్రేక్షకులకు కనువిందు చేయడానికి, వినోదంలో విహరింపచేయడానికి స్టార్ మా “ఇష్మార్ట్ జోడి” సీజన్ 2. ఓంకార్ ప్రెజెంటర్ గా ఆయన దర్శకత్వంలో ఇష్మార్ట్ జోడి సీజన్ 1 పెద్ద విజయం సాధించింది. మరిన్ని అదనపు ఆకర్షణలతో ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభించడానికి సర్వం సిద్ధం అయింది.

మనకి వివిధ సీరియల్స్ లో, రకరకాల కార్యక్రమాల్లో కనిపించే సెలెబ్రిటీలు ఈ షో లో సందడి చేయబోతున్నారు. రకరకాల రౌండ్స్ లో ఈ జంటలు ఈ సీజన్ లో మనల్ని అలరించబోతున్నారు. ప్రీతీ నిగమ్ – నగేష్, బాబా భాస్కర్ – రేవతి, కౌశల్ – నీలిమ, అమ్మ రాజశేఖర్ – రాధ, అవినాష్ – అనుజా, శివారెడ్డి – స్వాతి రెడ్డి, కౌశిక్ – భవ్య, మహేశ్వరీ-శివనాగ్, ఏకనాథ్ -హారిక, లహరి – ధీరేన్, హర్షిత – వినయ్, విశ్వ – శ్రద్ధ… ఈ సీజన్ లో వినోదాన్ని అందిస్తూ “ఇష్మార్ట్ జోడి” టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.

స్టార్ మా తో ఎంతో అనుబంధం వున్న దర్శకుడు ఓంకార్ ఈ సారి ఈ షో నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు. ఈ షో ఈ 26 నుంచి మొదలవుతుందని స్టార్ మా లో చూసాను. సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ లాంచ్ ప్రసారం అవుతుంది.

ప్రతి వారం శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పక చూడండి.. ఇష్మార్ట్ జోడి సీజన్ 2. మీ అభిమాన స్టార్ మా లో.

“ఇష్మార్ట్ జోడీ 2” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: 

Content Produced by: Indian Clicks, LLC

సంబంధిత సమాచారం :