మాసివ్ అండ్ క్రేజీ లైనప్ తో రెడీ అవుతున్న ప్రైమ్ వీడియో సంస్థ.!

Published on Apr 29, 2022 9:00 am IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలలో దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా డిజిటల్ కంటెంట్ కి భారీ డిమాండ్ నెలకొంది. దీనితో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో గట్టి పోటీ నెలకొనగా..

తాజాగా ఈ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక క్రేజీ అండ్ మాసివ్ లైనప్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ బిగ్ అప్డేట్ తో వారు ఏకంగా 40 కి పైగా కొత్త వెబ్ సిరీస్ లు అలాగే మరికొన్ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సినిమాలు వారు అనౌన్స్ చేశారు.

ఇక వాటిలో కొత్త సిరీస్ లతో పాటుగా పలు క్రేజీ హిట్స్ ది ఫ్యామిలీ మ్యాన్, మేడ్ ఇన్ హెవెన్, బ్రీత్ ఇంటూ ది షాడోస్, అలాగే పాతాళ లోక్ వంటి సిరీస్ లకి సీక్వెల్స్ కూడా క్లియర్ చెయ్యగ వాటితో పాటు మన తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య చేస్తున్న “దూత” సిరీస్ సహా మరికొన్ని తెలుగు కంటెంట్ లకు అనౌన్స్ చేశారు. ఇలా ఓవరాల్ గా అయితే ప్రస్తుతం తమ దగ్గర ఉన్న భారీ లైనప్ తో రానున్న రోజుల్లో తమ నుంచి సాలిడ్ ట్రీట్ గ్యారెంటీ అని కన్ఫర్మ్ చేసేసారు.

సంబంధిత సమాచారం :