“పుష్ప” ఈ కొత్త వెర్షన్ ని తీసుకొచ్చిన ప్రైమ్ వీడియో.!

Published on Jan 8, 2022 8:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యిన చిత్రం జస్ట్ నిన్న సాయంత్రం నుంచే ఓటిటి లోకి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాని మాత్రం కొత్త వెర్షన్ లో తీసుకొచ్చారని చెప్పాలి. ఒరిజినల్ గా ఈ సినిమా ని థియేట్రికల్ కట్ కి 2 గంటల 59 నిమిషాలు కట్ చెయ్యగా ఓటిటి వెర్షన్ కి గాను 2 గంటల 55 నిమిషాలు మాత్రమే కట్ చేశారు.

అయితే ఇక్కడ సినిమాలో కొన్ని అనవసర సీన్స్ తీసేసి ఇది వరకు సినిమాలో పెట్టని కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారు. అలాగే సామ్ సాంగ్ లో కూడా కొన్ని విజువల్స్ ని యాడ్ చేశారు. సో ఇది వరకు మిస్సయిన వారు మాత్రం ఈసారి మిస్సవ్వకుండా చూడాలని చెప్పాలి.

సంబంధిత సమాచారం :