నైజాంలో “సర్దార్”, “ప్రిన్స్” డే 1 కలెక్షన్ డీటెయిల్స్ ఇవే!

నైజాంలో “సర్దార్”, “ప్రిన్స్” డే 1 కలెక్షన్ డీటెయిల్స్ ఇవే!

Published on Oct 22, 2022 2:03 PM IST

ఈ వారం మన తెలుగు బాక్సాఫీస్ దగ్గరకి బల్క్ రిలీజ్ లు అయితే వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో తమిళ్ డబ్ చిత్రాలు కూడా రెండు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కార్తీ “సర్దార్” ఒకటి కాగా మరొకటి శివకార్తికేయన్ నటించిన “ప్రిన్స్” చిత్రాలు. మరి సర్దార్ ని అయితే మిత్రన్ తెరకెక్కించిన ప్రిన్స్ ని మన టాలీవుడ్ దర్శకుడు అనుదీప్ తెరకెక్కించాడు.

మరి ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటగా కార్తీ సర్దార్ అయితే నైజాం లో మొదటి రోజు 57 లక్షల నెట్ వసూళ్లు అందుకోగా ప్రిన్స్ చిత్రానికి 53 లక్షల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది డెఫినెట్ గా ఓ సాలిడ్ నంబర్స్ అని చెప్పాలి. అలాగే మన తెలుగు సినిమాలతో సమానంగా ఈ డబ్ చిత్రాలని మనవాళ్ళు వసూళ్లు అందించడం మరో గమనించాల్సిన అంశం. ఇక ఈ రెండు రోజుల్లో ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు