‘వారణాసి’ టు ‘ఖలీఫా’.. కుంభ డెడికేషన్!

Prithviraj-Sukumaran

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే వారణాసి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో టాలెంటెడ్ బిగ్ స్టార్స్ ప్రియాంక చోప్రా జోనస్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటిస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కుంభ అనే పవర్ఫుల్ విలన్ గా నటిస్తుండగా తను చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా మారింది.

అయితే ఇందులో తన సాలిడ్ ఫిజిక్ మేకోవర్ పిక్ ని షేర్ చేసుకొని వారణాసి టు ఖలీఫా.. కుంభ టు అమీర్ అలీ అంటూ పోస్ట్ చేసారు. అంటే వారణాసి లో చేస్తున్న కుంభ రోల్ ఖలీఫా సినిమాలో చేస్తున్న అమీర్ అలీ ఈ రెండు సినిమాలు రెండు పాత్రల్లో తను గ్యాప్ లేకుండా వర్క్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు. దీనితో తన డెడికేషన్ తో కూడిన ఈ పోస్ట్ ఇంకా ఫోటో వైరల్ గా మారింది.

Exit mobile version