లేటెస్ట్ : పృథ్వీరాజ్ ‘కడువా’ రిలీజ్ పోస్ట్ పోన్

Published on Jun 27, 2022 9:00 pm IST

మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కడువా. ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయింది యూనిట్. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ సంస్థలపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కడువా మూవీలో టైటిల్ రోల్ లో కనిపించనున్నారు హీరో పృథ్వీరాజ్.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తమ మూవీని జూన్ 30న విడుదల చేస్తున్నట్లు టీజర్ లో ప్రకటించిన యూనిట్, కొద్దిసేపటి క్రితం కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ ని మరొక వారం రోజులుగా పాటు వాయిదా వేసి, జులై 7న ఫైనల్ గా మూవీని థియేటర్స్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయానాన్ని ప్రేక్షకాభిమానులు సహృదయంతో అర్ధం చేసుకుని విడుదల అనంతరం తప్పకుండా ఆదరిస్తారని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం :