బిగ్ బాస్ 5: రవి లహరి ల పై ప్రియ ఆరోపణలు

Published on Sep 21, 2021 4:00 pm IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో లో మరొకసారి నామినేషన్ ఉండటం తో హౌజ్ లో హంగామా మొదలైంది. ఈ నేపథ్యం లో ప్రియ మరియు లహరి ల మధ్య జరుగుతున్న సంభాషణలు వేడెక్కాయి.

ఈ నేపథ్యం లో ప్రియ లహరి ను నామినేట్ చేయడం జరిగింది. తనతో ఆమె సమయం గడపడం లేదని, ఇంట్లో ఉన్న సభ్యులందరితో బిజిగా ఉంటుంది అన్న విషయం తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త లహరి ను కలవర పెట్టింది. ప్రియ వ్యవహరించిన తీరు తో లహరి దూకుడు గా వ్యవహరించడం జరిగింది. ఈ నేపథ్యం లో లహరి మరియు రవి లు ఇద్దరూ అర్థరాత్రి బాత్రూమ్ లో కౌలించుకుంటున్నట్లు తెలిపింది ప్రియ. అయితే ప్రియ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల రవి అసహనం వ్యక్తం చేశారు. ప్రియ చేసిన వ్యాఖ్యల పట్ల లహరి సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రియ ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :