బాలీవుడ్ లోకి ప్రియా ప్రకాష్ !

వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో నటిస్తుంది. ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ లండన్ లో జరుగుతుంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘భగవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ మాబుల్లి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇదిలావుంటే ప్రియా ప్రకాష్ మలయాళంలో నటించిన మొదటి చిత్రం ‘ఓరు ఆదార్ లవ్’ ఈచిత్రం ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాలతో వాయిదా పడి వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version