ఇంటర్వ్యూ : ప్రియా ప్రకాష్ వారియర్ – సోషల్ మీడియా ద్వారే నా లైఫ్ ‘హై’లో ఉంది.

 

సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’. ఈ సినిమా ‘లవర్స్ డే’ పేరుతో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల అవుతుంది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి షాన్ రెహమాన్ సంగీతం అందించారు. సుఖీభవ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

సోషల్ మీడియా ద్వారే మీకు ఇంత ఫేమ్ వచ్చింది. సోషల్ మీడియా గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?

ప్రతిచోట ప్రతిదానిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ థింక్స్ రెండూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ఉన్నాయి. బట్ నా విషయానికీ వస్తే సోషల్ మీడియా నా వరకూ చాలా పాజిటివ్ గానే హెల్ప్ చేసింది. మలయాళంలోని ఒక స్మాల్ బడ్జెక్ట్ మూవీ సాంగ్, కేవలం సోషల్ మీడియా ద్వారానే అదర్ లాంగ్వేజ్ స్ ల్లోకి వెళ్లి, వైరల్ అయి.. ఈ రోజు మాకు ఇంత ఇంత ఫేమ్ తీసుకొచ్చింది. ఇది ఒక్క సోషల్ మీడియా వల్లే సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారే నా లైఫ్ హైలో ఉంది.

అదర్ సినీ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ మీకు ఆఫర్స్ ఇచ్చారు. ఆ ఫిల్మ్స్ లో ఎందుకు చెయ్యలేదు. రెమ్యూనిరేషన్ నచ్చక చెయ్యలేదని రూమర్స్ వచ్చాయి ?

రెమ్యూనిరేషన్ నచ్చక చెయ్యలేదనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అండి. అయితే ఇతర సినీ ఇండస్ట్రీస్ నుంచి.. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా నాకు ఆఫర్స్ వచ్చిన మాట వాస్తవం. కానీ అప్పటికే ‘లవర్స్ డే’ సినిమా షూటింగ్ వల్ల.. ఆ ఆఫర్స్ అన్ని వదులుకోవాల్సి వచ్చింది. అందుకే లాస్ట్ ఇయర్ ఏ సినిమా చెయ్యలేదు.

‘లవర్స్ డే’ సినిమా నుండి రిలీజ్ చేసిన సాంగ్ వల్లే కదా.. మీకు ఇంత ఫేమ్ వచ్చింది. అంటే సాంగ్ రిలీజ్ అయ్యాక కూడా ఆ సినిమా షూటింగ్ ని వన్ ఇయర్ పైగా చేసారా ?

నిజానికి మేం ఫస్ట్ షూట్ చేసింది వైరల్ అయిన ఆ సాంగ్ ఒక్కటే. సాంగ్ రిలీజ్ అయి వైరల్ అయ్యాకే.. మిగిలిన సినిమా మొత్తం షూట్ చేశాము.

తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా మీకు ఆఫర్స్ వచ్చాయి అన్నారు. ఏ సినిమాల నుండి ఆఫర్స్ వచ్చాయి ?

ఆ సినిమాలు పేర్లు నాకు తెలియదు. కానీ అల్లు అర్జున్ గారి సినిమాలో ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే కమిట్ అయినా సినిమా వల్ల ఆయన సినిమా మిస్ చేసుకున్నాను. కానీ ఫ్యూచర్ లో ఆయన పక్కన నటించే అవకాశం వస్తే మాత్రం.. ఈ సారి వదులుకోను.

సింబా సినిమాలో రణ్‌వీర్ సింగ్ పక్కన సారా అలీఖాన్ చేసిన రోల్ లో ఫస్ట్ మిమ్మల్నే అనుకున్నారట. మీరు ఎందుకు ఆ సినిమా చెయ్యలేదు ?

ఏమోనండి ఆ సినిమా టీం నుండి నాకు అయితే ఎలాంటి ఆఫర్ రాలేదు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చింది.. నేను ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నానని వచ్చిన వార్తలన్నీ రూమర్సే.

మీరు ప్రస్తుతం హిందీలో చేస్తోన్న ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా ఈ మధ్య వివాదాలతో వార్తల్లోకెక్కింది. ఆ సినిమాలో మీ పాత్ర శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉందని బోనీ కపూర్, మీతో పాటు ఆ సినిమా టీమ్ కి కూడా నోటీసులు పంపారు. ఆ విషయం గురించి చెప్పండి ?

నాకు పర్సనల్ గా ఇంతవరకు ఏ నోటీసు రాలేదు. కానీ ఆ మూవీకి సంబంధించి మా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి నోటీసులు వచ్చాయి. వాళ్ళు ఆ విషయాన్నీ హ్యాండల్ చేస్తున్నారు. నేను కేవలం ఆ సినిమాలో శ్రీదేవి అనే క్యారేక్టర్ లో నటిస్తున్నాను. అంతకుమించి నాకు ఆ వివాదం గురించి ఏమి తెలియదు.

అంటే నిజంగానే శ్రీదేవి జీవితం, ముఖ్యంగా ఆమె మరణం ఆధారంగానే ఆ సినిమాని తెరెకెక్కిస్తున్నారా ?

ఆ సినిమా నుండి ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ లో కొన్ని ఎలిమెంట్స్ శ్రీదేవిగారి జీవితానికి దగ్గరిగా ఉన్నాయని మీడియాతో పాటు అలాగే చాలామంది అనుకున్నారు. బట్ నాకు తెలిసినంత వరకూ ఆ సినిమా కథ.. పూర్తిగా మా ‘శ్రీదేవి బంగ్లా’ డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న కథే.

‘లవర్స్ డే’ సినిమా గురించి చెప్పండి ?

ఇది మలయాళ మూవీ అయినా ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల అవుతుంది. సినిమాలో సిక్స్ సాంగ్స్ ఉంటాయి, స్కూల్ లైఫ్ గాని, సినిమాలో ఎంటర్టైన్మెంట్ గాని చాలా బాగుంటుంది. తెలుగు ప్రేక్షకులుకు కూడా మా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను.

తెలుగులో మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ? అలాగే అదర్ లాంగ్వేజ్ స్ లో ప్రస్తుతం ఏ మూవీస్ చేస్తున్నారు ?

ఇప్పటికైతే ఇంకా తెలుగులో ఏ మూవీ ఒప్పుకోలేదండి. అదర్ లాంగ్వేజ్ స్ విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో ఒక్క ‘శ్రీదేవి బంగ్లా’నే చేస్తున్నాను. ఇంకా కొన్ని మూవీస్ డిస్కషన్ లో ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో.

Exit mobile version