ప్రియదర్శి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘సుయోధన’ టీజర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించిన ఈ చిత్రానికి వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకుడు. ద్రిషిక చందర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, కథలోని కొత్తదనం తనను బాగా ఆకట్టుకుందని, ఇదొక విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు. ‘సుయోధన’ పాత్రకు సాయికుమార్ గారు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. సాయికుమార్ మాట్లాడుతూ, సినిమాలో తదుపరి ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డెబ్యూ డైరెక్టర్ మాధవ్ రెడ్డి స్క్రిప్ట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించినట్లు నిర్మాత బోసుబాబు తెలిపారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది.
