ఆ స్టార్ హీరో పై నాకు క్రష్ – ప్రియమణి

Published on Oct 3, 2023 12:00 am IST

సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్, నారప్ప చిత్రం తర్వాత మళ్ళీ డిమాండ్ పెరిగింది. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందినా ప్రియమణికి గతంలో రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో, ఆమె హీరోయిన్ గా ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రోల్స్ వస్తున్నాయి. ప్రియమణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బాలీవుడ్ హీరోల్లో మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని ఓ యాంకర్ అడగ్గా.. ప్రియమణి వెంటనే షారుఖ్ ఖాన్ అని చెప్పింది. లక్కీగా షారుఖ్‌తో జవాన్ మూవీతో వర్క్ చేసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని కోరికగా ఉంది. ఇక బాలీవుడ్ నటుల్లో ఎవరి స్టయిల్ వారిదే. నాకు చాలా మంది హీరోలు ఇష్టమని చెప్పుకొచ్చింది. అన్నట్టు రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్రను చేయాలని తాను కొన్నేళ్ళుగా కలలు కంటున్నాను అని ప్రియమణి ఆ మధ్య కామెంట్స్ చేసింది.

సంబంధిత సమాచారం :