బాలయ్య సరసన మళ్లీ నటించబోతుంది !

Published on May 29, 2022 11:00 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియ‌మ‌ణి ఓ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. ప్రియ‌మ‌ణి గ‌తంలో బాల‌య్య‌తో మిత్రుడు అనే సినిమాలో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి బాల‌య్య స‌ర‌స‌న ఆమె క‌నిపించ‌నుంది. అయితే ఆమెది సీనియర్ బాలయ్య పాత్రకు హీరోయిన్ పాత్ర అట.

కాగా హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో నటిస్తోంది. బాలయ్యకి కూతురిగా ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. ఇక జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :