“RRR” పై ప్రియాంకా చోప్రా కామెంట్స్ వైరల్.!

“RRR” పై ప్రియాంకా చోప్రా కామెంట్స్ వైరల్.!

Published on May 17, 2023 7:04 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం గాని గ్లోబల్ వైడ్ గా అది అందుకున్న సక్సెస్ కోసం గాని అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం అయితే ఇంత ఫేమ్ అందుకోగా ఈ చిత్రంపై ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నిన్న RRR హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లపై చేసిన కామెంట్స్ తర్వాత ఇప్పుడు వారి సినిమాపై చేయడం ఆసక్తిగా మారింది. అయితే తాను ఇప్పటి వరకు కూడా RRR సినిమా చూడలేదట. తనకి సినిమా చూసేంత ఖాళీ ఉండడం లేదని అయినా.. తాను సినిమాల కంటే కూడా సిరీస్ లను చూసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తానని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు