ఎన్టీఆర్ తో ప్రియాంక చోప్రా ?

ఎన్టీఆర్ తో ప్రియాంక చోప్రా ?

Published on Jun 5, 2023 10:08 AM IST

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య అయితే ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందని టాక్ నడిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ కి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో స్టార్ నటి ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఇండియా – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు