దీపిక స్థానాన్ని భర్తీ చేసిన ప్రియాంక చోప్రా..!

Published on Aug 17, 2021 11:49 pm IST

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముంబై అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్‌’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చైర్‌ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గతంలో ఈ పదవిలో ఉన్న హీరోయిన్ దీపిక పదుకుణే నాలుగు నెలల కిందట ఈ పదవి నుంచి వైదొలగింది. దీంతో దీపికా స్థానాన్ని ఇప్పుడు ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. ‘మామి’ బోర్డు సభ్యులు ప్రియాంకను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ప్రియాంక చోప్రా మాట్లాడుతూ మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని, మామిలోని సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఫిల్మ్‌ఫెస్టివల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :