ప్రముఖ బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ SSMB29లో హీరోయిన్‌గా నటించనుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేయనున్నాడు.
ఇక ఈ సినిమా కోసం అబిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేసేలా ప్రియాంక హైదరాబాద్‌లో సందడి చేస్తోంది.
ఆమె తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించింది. ఈమేరకు సోషల్ మీడియాలో నెట్టింట పలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆమె మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.