‘చారు’ ఎంట్రీకి డేట్ అండ్ టైమ్ ఫిక్స్

‘చారు’ ఎంట్రీకి డేట్ అండ్ టైమ్ ఫిక్స్

Published on Jul 6, 2024 8:00 PM IST

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స‌రిపోదా శ‌నివారం’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నాడు. కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ ప్రియాంక మోహ‌న్ న‌టిస్తుండ‌టంతో ఆమె ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ పై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘చారు’ పాత్ర‌ను జూలై 7న సాయంత్రం 4.05 గంట‌ల‌కు ఇంట్రొడ్యూస్ చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ తెలిపారు.

దీంతో ప్రియాంక అభిమానుల‌తో పాటు నాని అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చారు పాత్ర‌లో ప్రియాంక ఎలా ఉండ‌బోతుందా అని వారు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇక ‘స‌రిపోదా శ‌నివారం’ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండ‌గా, డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 29న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు