‘హరిహర వీరమల్లు’ ప్రొడ్యూసర్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన మూవీ టీమ్

Published on Feb 5, 2023 1:08 am IST


గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీతో పాటు ఆ తరువాత బంగారం మూవీని కూడా నిర్మించి మంచి పేరు సొంతం చేసుకున్న సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం, కొంత గ్యాప్ తరువాత మరొక్కసారి పవన్ తో నిర్మిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇక నేడు ఏ ఎం రత్నం బర్త్ డే సందర్భంగా ముంబై లోని ఎన్ డి స్టూడియోస్ లో ఆయన బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు హరిహర వీరమల్లు మూవీ యూనిట్ సభ్యులు. కాగా ఈ సెలెబ్రేషన్స్ లో డైరెక్టర్ క్రిష్ తో పాటు ఇందులో కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు పలువురు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఏ ఎం రత్నం బర్త్ డే సెలెబ్రేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :