దీపికా ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.!

Published on Jun 18, 2022 12:05 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కె” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ప్రభాస్ మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా దీపికా ఆరోగ్యం సడెన్ మారిపోవడంతో ఒక్కసారిగా సినీ వర్గాలు షాకయ్యాయి. అయితే తర్వాత మళ్ళీ ఆమె కుదుటపడింది అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ అంశంపై ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వనీ దత్ మరింత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీపికా కి బీపీ సంబంధిత సమస్య ఉందని దాని వల్లే అప్పుడు ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది అని అప్పుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా గంటలోనే మళ్ళీ ఆమె తిరిగి కోలుకుంది అని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :