పవన్ “హరిహర వీరమల్లు” వర్కింగ్ స్టిల్ పై బండ్ల గణేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Apr 7, 2022 1:30 pm IST

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మాసివ్ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భీమ్లా నాయక్ చిత్రం విడుదల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పవన్, ఇప్పుడు హరిహర వీరమల్లు కోసం టైమ్ కేటాయించారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుండి విడుదల అయిన వర్కింగ్ స్టిల్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న పవన్, ఈ సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపించనున్నారు.

ఈ వర్కింగ్ స్టిల్స్ లో ఒక దాన్ని పోస్ట్ చేస్తూ పవన్ వీరాభిమాని, నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. గన్ను పట్టిన, పెన్ను పట్టిన, కత్తి పట్టిన, మైకు పెట్టినా, ఎవరి పై గురి పెట్టిన మీకు తిరుగు లేదు దేవర అంటూ పవన్ కళ్యాణ్ పై పొగ్తల వర్షం కురిపించారు. పవన్ సరికొత్త మేకోవర్ తో ఉన్న ఈ స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ. దయాకర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఈ చిత్రం లో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :