“పుష్ప ది రూల్” పై బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

“పుష్ప ది రూల్” పై బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

Published on Nov 7, 2022 2:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం కి సంబంధించిన పార్ట్ 2 పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ మాస్ కి సరికొత్త అర్దం తెలిపారు. పుష్ప ది రూల్ మూవీ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మేరకు ప్రొడ్యూసర్ బన్నీ వాసు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకూ స్క్రీన్స్ చిరిగి పోవడం చూశాం, పుష్ప 2 తో పగిలి పోవడం చూస్తాం అంటూ చెప్పుకొచ్చారు. బన్నీ వాసు చేసిన వ్యాఖ్యల తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక మందన్న బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు