‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ రేట్స్‌పై నిర్మాత బన్నీవాసు క్లారిటీ..!

Published on Jun 4, 2022 8:00 pm IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “పక్కా కమర్షియల్”. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌తో కలిసి బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై స్పష్టత ఇచ్చారు. ‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. నైజాంలో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయని అన్నారు. టికెట్‌ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని అన్నారు.

సంబంధిత సమాచారం :