నిర్మాత బన్నీ వాసు కి తృటిలో తప్పిన ప్రమాదం!

Published on Jul 17, 2022 8:45 pm IST


పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరద లో చిక్కుకున్న వారిని ముఖ్యం గా ఒక గర్భిణీ ని రక్షించే సమయం లో పడవ ప్రమాదానికి గురి అయింది.

బాడవ గ్రామంలో వరదలో చిక్కుకున్న వారిని పడవలో ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉధృతి పెరగడంంతో పడవ నీటిలో కొట్టుకోపోసాగింది. ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు తగిలి, పడవ విరిగి పోయింది. వెంటనే పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు.

ప్రమాదం తప్పటంతో గర్భిణీ , బన్నీవాసు, జనసేన నాయకులు, పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని బన్నీ వాసు అన్నారు. ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత సమాచారం :