బ్రేకింగ్: నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా దామోదర ప్రసాద్ గెలుపు

Published on Feb 19, 2023 5:06 pm IST

నిర్మాతల మండలి ఎన్నికల ఎంతో ఉత్కంఠ గా జరిగాయి. ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ 339 ఓట్లు, జెమిని కిరణ్ 315 ఓట్లు పొందారు. 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు.

హనరబుల్ సెక్రెటరీ పదవికి ప్రసన్న కుమార్ 378 ఓట్లు సాధించగా, yvs చౌదరి 362 ఓట్లు సాధించారు. 16 ఓట్ల తేడాతో ప్రసన్న కుమార్ గెలిచారు. జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి 412, నట్టి కుమార్ 247 ఓట్లతో గెలిచారు.

సరికొత్త మెంబర్స్:

దిల్ రాజు 470, దానయ్య 421, రవి కిషోర్ 419, యలమంచిలి రవి 416, పద్మిని 413, బెక్కం వేణుగోపాల్ 406, సురేందర్ రెడ్డి 396, గోపీనాథ్ ఆచంట 353, మధుసూదన్ రెడ్డి 347, కేశవరావు 323, శ్రీనివాస్ వజ్జ 306, అభిషేక్ అగర్వాల్ 297, కృష్ణ తోట 293, రామకృష్ణ గౌడ్ 286, కిషోర్ పూసలు 285 ఓట్లతో గెలిచారు.

సంబంధిత సమాచారం :