లేటెస్ట్..నిర్మాత దిల్ రాజు ఇంట బుల్లి ‘వారసుడు’ జన్మించాడు.!

లేటెస్ట్..నిర్మాత దిల్ రాజు ఇంట బుల్లి ‘వారసుడు’ జన్మించాడు.!

Published on Jun 29, 2022 10:15 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ మరియు మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతలు మరియు నిర్మాణ సంస్థలలో దిల్ రాజు మరియు వారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు కూడా ఒకరు. అయితే ఇప్పుడు తెలుగు సహా పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దిల్ రాజు గత కొన్నాళ్ల కితమే తన వ్యక్తిగత జీవితం పరంగా కొత్త అధ్యాయాన్ని కూడా స్టార్ట్ చేశారు.

మరి ఇప్పుడు తాజాగా దిల్ రాజు మరియు వారి సతీమణి వ్యఘా రెడ్డి దంపతులు ఈరోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో దిల్ రాజు ఈ బుల్లి వారసుడు రాకతో ఇంట ఆనంద వాతావరణం నెలకొనగా సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు దంపతులకి శుభాకాంక్షలు సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.

మరి ఈ సందర్భంగా మా 123తెలుగు యూనిట్ కూడా వారికి శుభాభినందనలు తెలియజేస్తుంది. ఇంకా ప్రస్తుతం అయితే దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ తో “వారసుడు” అలాగే రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో తమ బ్యానర్ లో ప్రతిష్టాత్మక 50 వ సినిమాలు సహా మరెన్నో చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు