ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం లో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు!

ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం లో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు!

Published on Aug 18, 2022 7:17 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు ఆగిపోవడం తో పాటుగా, సినిమా పరిశ్రమ కి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరుపుతోంది. అయితే తాజాగా ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు అపేసి కమిటీ లు వేసుకున్నామని, నిర్మాతల గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామనీ, 8 వారాల తరువాత ఓటీటి లోకి సినీమా ఇవ్వాలి అనీ, టికెట్ రేట్లు గురించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

థియాటర్ లు, మల్టిప్లెక్సుల తో టికెట్ ధరల విషయం, ఇక సినిమా లో ఎందుకు వృధా కర్చు అవుతుంది అని మాట్లాడుకున్న విషయాన్ని వెల్లడించారు. 3,4 రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి, అవి అయ్యాక ఫైనల్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం కావాలి అని నిర్ణయం తీసుకోలేదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు అని అన్నారు. అంతేకాక మనం షూటింగ్ లు ఆపి ఏం చేస్తున్నాం అని బాలీవుడ్ ఆతృతగా చూస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. దిల్ రాజు చేసిన వ్యాఖ్యల తో ఇండస్ట్రీ లో చర్చలు మొదలయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు