జగన్, కెసిఆర్ లకు దిల్ రాజు ప్రత్యేక ధన్యవాదాలు.!

Published on Mar 8, 2022 10:00 am IST


కరోనా పరిస్థితులతో ముఖ్యంగా సినీ పరిశ్రమకి ఎంత నష్టం వాటిల్లిందో తెలిసిందే. దీనితో ఈ కష్ట సమయాల్లో గత కొన్నాళ్ల కితమే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ భరోసా అందించారు. అయితే మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమ దానినే నమ్ముకున్న థియేటర్స్ వ్యవస్థలకు కూడా ఎప్పటికప్పుడు అనేక వెసులుబాట్లు అందిస్తూ కూడా వచ్చారు.

అయితే గత ఏడాది నుంచి ఏపీలో తలనొప్పిగా మారిన టికెట్ ధరల అంశానికి ఫైనల్ గా నిన్న తెర పడడంతో సినీ ప్రముఖులు మరియు పెద్దలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు తన సినిమా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తరపున మొదటగా టికెట్ ధరలు సవరించి కొత్త జీవో రిలీజ్ చేసినందుకు గాను ఏపీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు.

ఇక అలాగే తెలంగాణలో అయితే ఐదు షోలకు గాను పలు పెద్ద సినిమాలకి అనుమతులు ఇవ్వడం చాలా మంచి అంశం అని తెలుగు సినీ పరిశ్రమ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతగానో ఉపయోగకరం అని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తాను తెలియజేసారు.

సంబంధిత సమాచారం :