గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాసీఖన్నా, రావు రమేష, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో
రూపొందిన ఈ సినిమా హక్కుల్ని కొన్న పంపిణీదారులకు భారీ లాభాల్ని ఆర్జించేలా చేసింది. ఈ విజయంతో మారుతి మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు.
అలాగే చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ల ఖాతాలో సాలిడ్ హిట్ నమోదైంది. అందుకే యువీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన వంశీ మారుతికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించారు. బహుమతి అందుకున్న మారుతి వంశీ.. నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతిరోజూ పండగే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Thank you Vamsi darling
nee lanti friend unte#PratiRojuPandaage ???????? pic.twitter.com/5d9UYdM7iY— Director Maruthi (@DirectorMaruthi) January 8, 2020
