పాన్ ఇండియా స్టార ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు ఇండియన్ సినిమాలపై.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై పడింది. అంతలా ఇంపాక్ట్ చూపెట్టిన ఈ సినిమాలకు మరో సీక్వెల్ మూవీ ఉంటుందా.. అనే విషయంపై తాజాగా ఓ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.
తమిళ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువా’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళంలో బాహుబలి, బాహుబలి-2 చిత్రాలను ఆయనే రిలీజ్ చేశారు. ఆయన ఇటీవల బాహుబలి మేకర్స్‌ను కలిశారని.. బాహుబలి-3 మూవీపై వారితో చర్చించినట్లుగా తెలిపారు.
అయితే, దానికంటే ముందు రెండు వేరే సినిమాలు ఉన్నాయని.. అటుపై ‘కల్కి-2’, ‘సలార్-2’ చిత్రాలు ఉన్నాయని.. ఆ తరువాతే ‘బాహుబలి-3’ ప్లాన్ చేస్తారని జ్ఞానవేల్ తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఒక్కసారిగా ‘బాహుబలి-3’పై చర్చ మొదలైంది. ఏదేమైనా ‘బాహుబలి-3’ మూవీ గనక పట్టాలెక్కితే, ఇక ఆ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని నెట్టింట తెగ చర్చ సాగుతోంది.