SSMB 28 గురించి ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించిన ప్రొడ్యూసర్

SSMB 28 గురించి ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించిన ప్రొడ్యూసర్

Published on Feb 15, 2023 2:17 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ SSMB 28. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ని అతి త్వరలో ప్రారంభించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నామని మొదట్లో తెలిపింది యూనిట్. అలానే కెజిఎఫ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో అప్పట్లో ఒక భారీ యాక్షన్ సీన్ కూడా తీశారు.

ఆ తరువాత ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ మారిందని, ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని త్రివిక్రమ్ సెలెక్ట్ చేసారని వార్తలు వచ్చాయి. కాగా వీటిన్నటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నేడు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ SSMB 28 గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించారు. నిజానికి మొదట తెరకెక్కించిన ఫైట్ తొలగించామని, ఇప్పుడు తెరకెక్కుతోంది మంచి ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అన్నారు.

అలవైకుంఠపురములో తరువాత వస్తున్న మూవీ కావడం అలానే దాదాపుగా పన్నెండేళ్ల గ్యాప్ తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ కావడంతో ఎక్కడా ఎవరి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసిన త్రివిక్రమ్ గారు, దానిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలానే బిజినెస్ పరంగా రాజమౌళి గారి సినిమాల తరువాత చాలా ఏరియాల్లో అదే స్థాయి బిజినెస్ ఈ మూవీకి జరిగే అవకాశం కనపడుతోందని, ఆగష్టు 11న రిలీజ్ కానున్న మూవీ తప్పకుండా అందరి అంచనాలకి మించి ఉంటుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు