“లాలా భీమ్లా” వీడియో పై నిర్మాత నాగ వంశీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Dec 7, 2021 8:20 pm IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు హీరోలుగా నిత్యా మీనన్, సంయుక్త లు హీరోయిన్స్ గా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. అయ్యప్పనుం కొషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఊర మాస్ పాట గా లాలా భీమ్లా ఇక ఊపు ఊపుతోంది. ఈ పాట లిరికల్ వీడియో ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో ఒక అద్బుతం గా వచ్చింది అంటూ భీమ్లా నాయక్ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ అంటున్నారు. ఈ పాట ను చూశా అని, థియేటర్స్ లో జనవరి 12 వ తేదీన ఈ పాటకి రచ్చ చేయడం పక్కా అనే విధంగా కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :