మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా “అంటే సుందరానికీ” – నిర్మాత నవీన్ యెర్నేని

Published on Jun 13, 2022 10:00 pm IST

నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, “అంటే సుందరానికీ విజయం టీం సమిష్టి కృషి. అంటే సుందరానికీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు, ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో అంటే సుందరానికీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. దాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే సుందరానికీ కూడా అలా అరుదైన సినిమానే. ఈ చిత్రానికి మరో చిత్రంతో పోలిక లేదు. ఇలా అరుదుగా వచ్చే సినిమాని మనం అందరం భుజాన వేసుకొని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం భాగమౌతాం.

ఇది మనందరి సినిమా. ఇది మనందరి విజయం.
మనందరి సెలబ్రేషన్. అంటే సుందరానికీ కి వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా అంటే సుందరానికీ. సులువైన మార్గాలు చాలా వున్నపుడు ఇలాంటి అంటే సుందరానికీ లాంటి కథ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ మా దర్శకుడు వివేక్ ఆత్రేయలో వున్నాయి. మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ లో వున్నాయి. నాలో, మా టీమ్ అందరిలో వున్నాయి. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూసారంటే రోజురోజుకి ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికీ వుంటుంది” అని అన్నారు.

నజ్రియా నజీమ్ మాట్లాడుతూ, “అంటే సుందరానికీ చిత్రాన్ని ఎంతగానో ఆదరించి పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఇది నా మొదటి తెలుగు సినిమా. నన్ను తెలుగు పరిశ్రమలోకి గొప్ప గా ఆహ్వానించిన ప్రేక్షకులకు థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం లో పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నాని గారు అమేజింగ్ కోస్టార్. వివేక్ సాగర్ , నికేత్, లత, పల్లవి, డైరక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్స్. నరేష్ ,రోహిణి, నదియా, అరుణ ఇలా నటీనటులు అందరూ గొప్పగా సపోర్ట్ చేశారు. నాపై నమ్మకంతో లీల పాత్ర ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి స్పెషల్ థాంక్స్. నేను పోషించిన అందమైన పాత్రలలో లీల ఒకటి. లీల పాత్రని మిస్ అవుతున్నా. ఈ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” అని తెలిపారు.

చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, “అంటే సుందరానికీ సగం క్రెడిట్ హీరో నాని గారికి, నిర్మాతలకు ఇస్తాను. ఇలాంటి వైవిధ్యమైన కథ వారు ఒప్పుకోకపోయింటే ఈ రోజు ఈ సినిమాని చూసే అవకాశం వుండేది కాదు. నాని గారికి నిర్మాతలు నవీన్, రవి గారి కృతజ్ఞతలు. కొన్ని సినిమాలు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మంచి సినిమా తీశామనే భావన కలుగుతుంది. అలా ఎమోషనల్ గా ఫీలైన సినిమా అంటే సుందరానికీ. ఈ సినిమా పది, ఇరవై రోజులు కాదు ఎప్పటికీ వుంటుంది. ప్రేక్షకులు ఎప్పటికీ చూస్తూనే వుంటారు. సినిమా చూసే కొద్ది నచ్చుతూనే వుంటుంది. సుందరం పాత్ర పోషించడం అంత ఈజీ కాదు. నానిగారు కాబట్టే సుందరం పాత్రని అంతగొప్పగా చేశారు. లీల పాత్రని గొప్పగా పోషించిన నజ్రియా కి థాంక్స్. నరేష్, రోహిణి, హర్ష వర్ధన్, నదియా, వెంకటేష్ మహా ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది మ్యూజికల్ మూవీ. కథతో పాటు మ్యూజిక్ వెళ్ళడం అంత సులువు కాదు. వివేక్ సాగర్ గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు.

డీవోపీ నికేత్ బొమ్మి కి నాకు మధ్య గ్రేట్ అండర్ స్టాండింగ్ వుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల కి థాంక్స్. ప్రొడక్షన్ డిజైనర్ లతా అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. బ్యూటీఫుల్ కాస్ట్యూమ్ అందించిన పల్లవి కి థాంక్స్. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దినేష్, సచ్విన్, స్వామి, విజయ్, విద్య, కీర్తి, అనిల్, తేజ్, విక్కీ, మా కో డైరెక్టర్ రాధ గారు అందరికీ థాంక్స్. ఈ సినిమాని ప్రేక్షకులు ప్రేమలేఖలు రాస్తున్నట్లు మూడు పేజీల వ్యాసాలు రాస్తున్నారు. సినిమాని ఎంజాయ్ చేస్తేనే ఇలా రాయగలరు. ఈ సినిమాని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, “అంటే సుందరానికీ మాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన చిత్రం. మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా. ఇదో క్లాసిక్. జంధ్యాల గారి సినిమాలు ఆహానా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి క్లాసిక్ సినిమా అంటే సుందరానికీ. విడుదల రోజు ఉదయం 3.30నుండి యూస్ లో మొదలై ఇప్పటివరకూ అభినందనలు ఆగడం లేదు. చాలా ఆనందంగా వుంది. కథని నమ్మి మా కోసం సినిమా చేసిన నాని గారి కృతజ్ఞతలు. నాని గారికి ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని భావిస్తున్నాను. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా చేశారు. మా బ్యానర్ లో నజ్రియా గారు ఫస్ట్ మూవీ చేసినందుకు ఆనందంగా వుంది. లీల పాత్రని మా అంచనాలకు మించి చేసినందుకు నజ్రియా గారికి కృతజ్ఞతలు. నరేష్, రోహిణి, నదియా, అరుణ, హర్ష, రాహుల్ రామకృష్ణ, ఇలా అందరూ బెస్ట్ పెర్ఫార్మమెన్స్ ఇచ్చారు.

ఒక సినిమాలో అందరూ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అరుదు. కానీ ఈ సినిమాకి అది కుదిరింది. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారు. పని రాక్షసుడు అనే మాట వంద శాతం మా దర్శకుడు వివేక్ ఆత్రేయకి నప్పుతుంది. మూడు గంటలు నిద్రపొతే మరో మూడు రోజులు నిద్రపోకుండా పని చేస్తారు. గత నాలుగు నెలలుగా రోజుకి రెండు గంటలే నిద్రపోయారు. ఇంత హార్డ్ వర్క్ చేసే దర్శకులు తక్కువ మందే వుంటారు. ప్రతి క్షణం బెటర్ మెంట్ కోసం తపిస్తుంటారు. ఇలాంటి క్యాలిటీ ఉంటేనే గొప్ప దర్శకులౌతారు. వివేక్ ఆత్రేయతో కంటిన్యూస్ గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. అంటే సుందరానికీ నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం. అంటే సుందరానికీ చిత్రాన్ని బిగ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, ఈ సినిమాని వోన్ చేసుకొని ప్రమోట్ చేసిన మీడియాకు కృతజ్ఞతలు” అని తెలిపారు.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ, “ఇంత గొప్ప టీం తో పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు నవీన్, రవి గారికి థాంక్స్. నా మ్యూజిక్ టీం అంతటికి థాంక్స్. అంటే సుందరానికీ నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది చిత్రం. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్” అని అన్నారు.

అరుణ బిక్షు మాట్లాడుతూ, “బామ్మ పాత్ర కోసం నన్ను తీసుకున్న దర్శకుడు వివేక్ గారికి, హీరో నాని గారికి, నిర్మాతలు కృతజ్ఞతలు. వీణ నేను వాయించడం వెనుక అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ థాంక్స్. నన్ను బామ్మ పాత్రలో ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. అందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.

సంబంధిత సమాచారం :