వైరల్ పోస్ట్ : సూపర్ స్టార్ మంచి మనసుపై ప్రొడ్యూసర్ ప్రసంశలు

Published on Feb 22, 2023 6:06 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న SSMB 28 మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఇక మొదటి నుండి తన తండ్రి దివంగత లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి మాదిరిగా పలు సామజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు మహేష్ బాబు. ఇటీవల తమ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారికి నూతన జీవితాన్ని అందించిన మహేష్ బాబాబు ప్రస్తుతం మరొక చిన్నారిని ఆదుకున్నారు.

విషయం ఏమిటంటే, ప్రస్తుతం మహేష్ బాబు తో SSMB 28 మూవీ నిర్మిస్తోన్న హారికా హాసిని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల తనకు తెలిసిన ఒక పేద కుటుంబంలోని చిన్నారికి శస్త్ర చికిత్స అవసరం అయిందని, ఆ విషయయమై నమ్రత గారిని సంప్రదిస్తే వెంటనే వారి వివరాలు తీసుకుని, అనంతరం ఆ చిన్నారి శస్త్ర చికిత్సకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసారని అన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి చికిత్స అనంతరం మెల్లగా కోలుకుంటోందని, ఈ విధంగా ఎందరో చిన్నారుల జీవితాల్లో సరికొత్త వెలుగుని నింపుతున్న గొప్ప మనసున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, నమ్రత గారు చిరకాలం వర్ధిల్లాలి అంటూ నాగవంశీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :