విషాదం : ప్రముఖ నిర్మాత మృతి !

Published on Sep 27, 2021 9:09 am IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ ఈ ఉదయం కన్నుమూశారు. ఆర్‌.ఆర్‌.వెంకట్‌ హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిర్మాతగా తన ప్రయాణంలో ఆర్‌.ఆర్‌.వెంకట్‌ ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పై పలు చిత్రాలు నిర్మించారు.

సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్‌, ఆటోనగర్‌ సూర్య, మిరపకాయ్‌, బిజినెస్‌మెన్‌, పైసా, పూలరంగడు చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు. 123తెలుగు.కామ్ తరఫున ఆర్‌.ఆర్‌.వెంకట్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :