అఖండ చిత్రం సక్సెస్ పై మిర్యాల రవీందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Dec 28, 2021 7:07 pm IST

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించడం జరిగింది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధించడంతో సినిమా కి సంబందించిన పలు విషయాలను నిర్మాత రవీందర్ రెడ్డి వెల్లడించడం జరిగింది.

కరోనా వైరస్ కారణం గా సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుంటే సినిమా ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. అంతేకాక ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. 2018 లో డైరెక్టర్ ఇంత బడ్జెట్ లో తీద్దాం అని, ఎంత బిజినెస్ చేస్తుందొ అని అనుకున్నాం. ఎందుకంటే ఆ కాంబినేషన్ కి ఉన్న బిజినెస్ అలాంటిది. అనుకున్న బడ్జెట్ కూడా దాటింది అని అన్నారు.

పెద్ద డైరెక్టర్, వెరీ రేర్ కాంబో కావడం తో నమ్మకం తో సినిమా చేశాం. సింహ, లెజెండ్ తర్వాత కావడం, ఒక స్టార్ హీరో కావడం తో చేయడం జరిగింది. బోయపాటి శ్రీను స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ సీన్ వరకూ మొత్తం చెప్తారు. సినిమా కచ్చితమైన విజయం సాధిస్తుంది అని 200 పర్సెంట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది.

సినిమా రిలీజ్ ముందు నుండే, సినిమా ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎలా రీయాక్ట్ అవుతారు అని చెబుతూనే ఉన్నా. సినిమా అలా కుదిరింది. ఈ సినిమా లో అన్ని ఉన్నాయి. మాస్ కి కావాల్సినవి, సెకండ్ క్యారెక్టర్ అన్నీ ప్లస్.

సినిమా కి హైప్ ఉండటం, సీన్స్ విజువల్ వండర్స్ లా తీయడం జరిగింది. సినిమా ఎప్పుడు వచ్చినా, ఒక ట్రెండ్ సెట్టర్, ల్యాండ్ మార్క్ సినిమా అవుతాది అని ముందే అనుకున్నాం. బాలకృష్ణ ఎంటైర్ కెరీర్ లో, బోయపాటి ఎంటైర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందు ఇండస్ట్రీ అంతా పానిక్ గా ఉంది, పెద్ద సినిమా కావడం చేత. కొన్ని కారణాల చేత ఏదైనా అయితే మిగతా పెద్ద సినిమాల పరిస్థతి ఎంటి అనే విషయం లో పానిక్ ఉంది.

సినిమా ఇక్కడ కంటే కూడా నార్త్ లో ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. మార్చి లో మరొక సినిమా మొదలు అవుతుంది. కొత్త హీరో తో చేయనున్నాం. వేరే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం, ఇంకా సెట్ అవ్వలేదు. చాలా చోట్ల మంచి వసూళ్ళను రాబట్టడం జరిగింది. నైజాం లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. లోకేషన్స్ లో బాలకృష్ణ తో మాట్లాడేప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఆన్ స్క్రీన్ వేరేలా ఉంటది, పక్కన ఉంటే వేరేలా ఉంటది. రీ టేక్ కూడా అవసరం ఉండదు, అంత బాగా చేస్తారు. వేరే హీరోలతో చేసే ప్లాన్స్ ఉన్నాయి.

సంబంధిత సమాచారం :