లేటెస్ట్ : ‘అమిగోస్’ చూసిన ఎన్టీఆర్ రియాక్షన్ వెల్లడించిన ప్రొడ్యూసర్

Published on Feb 10, 2023 1:46 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేయగా ఆయనకు జోడీగా అశికా రంగనాథ్ నటించారు. జీబ్రాన్ సంగీతం అందించిన ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి . ఇక మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , ట్రైలర్, టీజర్ ఇలా అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి.

రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రానున్న అమిగోస్ టీమ్ నేడు కొద్దిసేపటి క్రితం మీడియాతో ఇంట్రారాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ, నేడు మా అమిగోస్ మూవీ చూసిన ఎన్టీఆర్ ఒకటే చెప్పారని, మూవీ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు తప్పకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుందని తెలిపారని, ఆయన ఒక స్టోరీని పక్కాగా జడ్జి చేసి చెప్పగలరని అన్నారు. మొత్తంగా ఎన్టీఆర్ నుండి మంచి రెస్పాన్స్ వినడం ఆనందంగా ఉందని, రేపు మీ అందరి ముందుకి రానున్న అమిగోస్ తప్పకుండా విజయం అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు రవిశంకర్.

సంబంధిత సమాచారం :