‘ఓ బేబీ’ హిందీ రీమేక్ ఆ హీరోయిన్ వద్దకు వెళ్లిందా ?

Published on Jul 13, 2019 12:01 am IST

సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేశారు సమంత. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రానా సినిమా హక్కులు ఎలాగూ తమ సురేష్ ప్రొడక్షన్స్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకోసమే సమంత చేసిన పాత్ర కోసం ఎవరైతే బాగుంటారని వెతుకులాట ప్రారంబించి చివరకు అలియా భట్ వద్ద ఆగాడట. ‘రాజీ’ చిత్రంతో తనలో ఏ స్థాయి నటి ఉందో ప్రూవ్ చేసుకున్న ఆమె అయితేనే టైటిల్ రోల్ బాగా పండుతుందని రానా భావిస్తున్నారట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే తెలుగు సినిమాల పట్ల హిందీలో ఈమధ్య మంచి క్రేజ్ ఏర్పడటం, అలియా ఇప్పటికే రాజమౌళి యొక్క భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తుండంతో ఆమె ఈ చిత్రానికి ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడనుంది.

సంబంధిత సమాచారం :

X
More