ఫస్ట్ లుక్ ను అభినందించిన సినీ పెద్దలకు కృతజ్ఞతలు – భగత్ సింగ్ నగర్ నిర్మాతలు

విదార్థ్ మరియు ధృవిక హీరో హీరోయిన్ లుగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించిన చిత్రం “భగత్ సింగ్ నగర్”. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు లభించిన స్పందనపై నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ తెలుగు తమిళ ప్రేక్షకులకు మా సినిమాను అభినందించిన సినీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసారు. మీ ఆదరణతో మేము మరింత బలంగా వినూత్న ప్రొమోషన్లతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తామని తెలియజేసారు…

భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ… కథ పరంగా సినిమాను ఆంధ్ర మరియు తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని కీలక ఘట్టాలను కేరళ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము అని తెలియజేసారు. మా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ని ఆదరించినట్టు మా సినిమాను కూడా ఆదరిస్తారని మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను. త్వరలో మీ ముందుకు భగత్ సింగ్ నగర్ టీజర్ తో వస్తామని తెలియజేసారు.

Exit mobile version