పింక్ రీమేక్ లో పవన్ కి హీరోయిన్ గా ఎవరంటే?

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నట్లు నిన్న అధికారికంగా వార్తలు వచ్చాయి. బోనీ కపూర్ మరియు దిల్ రాజు నిర్మాతలుగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అనూహ్యంగా యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పవన్ కమ్ బ్యాక్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. గతంలో ఈయన ఓ మై ఫ్రెండ్, ఎం సి ఏ వంటి చిత్రాలు తెరకెక్కించారు. అధికారిక ప్రకటన రావాల్సివున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది.

సౌత్ లో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతారను ఈ చిత్రంలో పవన్ సరసన నటింప చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి నటించక పోవడంతో జంట ఫ్రెష్ గా ఉంటుందని వారు ఆలోచిస్తున్నారట. అలాగే పింక్ మూవీలో హీరో భార్య పాత్ర తక్కువ నిడివి మాత్రమే ఉంటుంది. ఒక వేళ నయనతారను తీసుకుంటే కొంచెం అదనపు హంగులు జోడించే అవకాశం కలదు. ఇంకా చర్చల దశలోనే ఈ విషయంగా ఉండగా, ఫైనల్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version