మాస్ మహారాజ “ఈగిల్” నుండి త్వరలో వరుస అప్డేట్స్!

Published on Sep 5, 2023 11:00 pm IST

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో రూపొందుతున్న ఈగిల్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కి సంబందించిన అప్డేట్స్ పై మేకర్స్ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు.

ఈగిల్ మూవీ కి సంబందించిన కొన్ని ఆసక్తికర గాసిప్స్ ను ఒక అభిమాని సోషల్ మీడియా లో షేర్ చేయగా, దానికి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెస్పాండ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ను మీరు ఊహించని రేంజ్ లో ప్రెజెంట్ చేయబోతున్నాం అని అన్నారు. మీ ఇమాజినేశన్ కి మించి ఉంటుంది అని, త్వరలో మాసివ్ అప్డేట్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య థాపర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :