“ప్రాజెక్ట్ కే” పై ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేసిన దర్శకుడు.!

“ప్రాజెక్ట్ కే” పై ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేసిన దర్శకుడు.!

Published on Nov 18, 2022 10:00 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో వరల్డ్ లెవెల్లో చేస్తున్న భారీ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఓ బిగ్గెస్ట్ స్కై ఫై అండ్ ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రం ఆల్రెడీ 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు షెడ్యూల్స్ ప్రకారం ఈ చిత్రం షూట్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పై అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మంచి వైరల్ గా మారుతున్నాయి.

ఈ చిత్రం స్క్రిప్ట్, సినిమా వరల్డ్ అంతా చాలా కొత్తగా ఉంటాయని అలాగే ఇతర సినిమాల్లా ఈ చిత్రానికి ఏవి రెంటెడ్ గా తీసుకోలేదని సెపరేట్ గా ఈ సినిమా కోసం తయారు చేశామని అలాగే ఈ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దాలో అనే దానికే ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుందని తాను తెలిపాడు.

దీనితో అయితే ఓ కొత్త ప్రపంచాన్నే వీరు సృష్టిస్తున్నారని చెప్పాలి మరి ముందు రోజుల్లో అయితే ఎలాంటి డీటెయిల్స్ బయటకి వస్తాయో అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు