“ప్రాజెక్ట్ కే” లో వర్క్ కోసం వాళ్ళకి ఆఫర్స్.!

“ప్రాజెక్ట్ కే” లో వర్క్ కోసం వాళ్ళకి ఆఫర్స్.!

Published on Nov 13, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో దర్శకుడు నాగశ్విన్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి దీనిపై అనేక అంచనాలు నెలకొనగా ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ కూడా సగానికి పైగా కంప్లీట్ కాగా మేకర్స్ ఈ చిత్రాన్ని దాదాపు భారతీయుల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులనే ఎంపిక చేసి సినిమాలో అనేక అంశాల్లో పని చేస్తున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే మేకర్స్ కొందరి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వీరైతే కెమికల్ ఇంజినీర్స్ మరియు ఎస్ ఎఫ్ ఎక్స్ సంబంధిత శాఖల్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ చేయగలిగే వాయఱి కోసం అయితే చూస్తున్నట్టు తెలిపారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలి అనుకుంటే ఈ పనితనం తెలిసిన వారు ఎవరైనా వీరు అందించిన మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. మరి వారికి ఇదైతే మంచి అవకాశం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు