లేటెస్ట్ : ఆ విషయంలో ‘ప్రాజక్ట్ – కె’ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ?

లేటెస్ట్ : ఆ విషయంలో ‘ప్రాజక్ట్ – కె’ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ?

Published on May 30, 2023 7:14 PM IST

టాలీవుడ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ప్రాజక్ట్ కె కూడా ఒకటి. అత్యధిక వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియన్ ని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతోంది. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రారంభం నుండి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ హైప్ ఉంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2024, జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రాజక్ట్ కె మరికొన్నాళ్లు వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. నిజానికి ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా అవసరం అవుతుందని, దానికి మరికొంత సమయం పెట్టె అవకాశం ఉన్నందున మూవీని యూనిట్ వాయిదా వేయనుందని అంటున్నారు. అయితే ఈ వార్తల పై ప్రాజక్ట్ కె మేకర్స్ నుండి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే 2024 పొంగల్ కి సూపర్ స్టార్ మహేష్ 28వ మూవీ బెర్త్ ని ఖాయం చేసుకోవడంతో, మరి ఆ సమయానికి ప్రాజక్ట్ కె వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు