ప్రభాస్ పై ఆ సీన్స్ షూట్ చేస్తున్నారు !

ప్రభాస్ పై ఆ సీన్స్ షూట్ చేస్తున్నారు !

Published on May 2, 2022 8:15 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ అంటూ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా ప్రభాస్‌ ఈ షూటింగ్‌ సెట్స్‌ లో జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ మరియు ఓ బాలీవుడ్‌ నటుడి పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్‌ వేశారు. ఈ సెట్స్ లోనే ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్‌ జరుగుతోంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రంలోని కీలక సీక్వెన్స్ ను ముందుగా తీయాలని చూస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్.

మరి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు