ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కె’ ఇంటర్వెల్ సీక్వెన్స్ అదే !

Published on Jul 4, 2022 11:30 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ అంటూ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమా ఇంటర్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. అమితాబ్ పాత్ర ఇంటర్వల్ లో ప్రభాస్ రెండో క్యారెక్టర్ ను పరిచయం చేస్తోందని.. సినిమాలో ఇది ట్విస్ట్ గా రివీల్ అవుతుందని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ తర్వాత షెడ్యూల్ లో ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను తీయాలని చూస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్.

మరి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :