“కల్కి 2898 ఎడి” నుంచి సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ అప్పుడే

“కల్కి 2898 ఎడి” నుంచి సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ అప్పుడే

Published on Jun 15, 2024 4:22 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి సాంగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ప్రశ్నగా మారింది.

అయితే ఆ మధ్య ఓ సాంగ్ షూట్ ని అయితే మేకర్స్ చేశారు. మరి ఇది కాకుండా ప్రభాస్ పాత్రపై ఓ సాంగ్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే భైరవ ఆంథెమ్ అంటూ డిల్జీత్ తో ప్లాన్ చేసిన సాంగ్ తాలూకా ప్రోమోని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ప్రభాస్ కూడా ఓ ప్రమోషనల్ సాంగ్ లో నేరుగా కనిపించడం ఎగ్జైటింగ్ గా ఉండగా ఈ ప్రమోషనల్ సాంగ్ ని మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

ఇక ఈ ఫుల్ సాంగ్ ని అయితే మేకర్స్ రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదెలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు