అక్కడ కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్న సందీప్ “మైఖేల్”

అక్కడ కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్న సందీప్ “మైఖేల్”

Published on Jan 27, 2023 11:06 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మైఖేల్. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అయితే హిందీ లో కూడా ఈ చిత్రాన్ని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పీ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ లపై భరత్ చొదరీ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, దివ్యాన్ష కౌశిక్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 3, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు