బుల్లితెర పై “PS2” కి రెస్పాన్స్ ఇదే!

Published on Sep 22, 2023 10:00 pm IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ పొన్నియిన్ సెల్వన్ 2. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది. అందుకు సంబందించిన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం 2.55 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది యావరేజ్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :